About the Author

యండమూరి వీరేంద్రనాథ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్, ప్రవృత్తి రీత్యా రచయిత మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు.  ఆయన రచనలు తమిళం, కన్నడ, మలయాళం, ఆంగ్లం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి.

అతను మోటివేషనల్ స్పీకర్  మరియు ఆస్ట్రేలియా, టాంజానియా, ఇండోనేషియా, సింగపూర్, US మరియు, UK లలో ప్రసంగాలు చేశారు.ఆయన సినీ దర్శకుడు కూడా. 30కి పైగా చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్నారు. అతను ఉత్తమ దర్శకత్వం మరియు నిర్మాణం కోసం బంగారు నంది అవార్డులు, భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు మరియు మరెన్నో గెలుచుకున్నారు. ఇటీవల ఆయన రాసిన ‘విజయానికి అయిదు  మెట్లు’ తెలుగు సాహిత్యంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

 

Yandamuri Veerendranath is an acclaimed novelist, playwright, and State Sahitya Academy award winner. His works have been translated into Tamil, Kannada, Malayalam, English, and Hindi. He is a motivational speaker and has delivered speeches at Australia, Tanzania, Indonesia, Singapore, US and, the UK. He is also a practicing chartered accountant. He is also a movie director. He is associated with more than 30 films. He won Golden Nandi awards for best direction and production, His films won Best Regional Film Award from President of India, Film Fare award and many more. His recent book ‘Success in Five Steps’ holds an all-time record in Telugu literature.

 

Forward for the Book

శీల ప్రభుపాద జీవిత చరిత్ర తెలుగులో వ్రాయమని ఇస్కాన్ సభ్యులు అడిగినప్పుడు ఒకక్షణం  దిగ్భ్రాంతుడనైయ్యాను.   ఆయన జీవితచరిత్ర వ్రాసే  అర్హత నాకేముందని ఆలోచించాను.   కానీ ఆ తరువాత ఆ మహనీయుడి జీవిత చరిత్ర తెలుగు ప్రజలందరికీ తెలియాలంటే, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక పుస్తకం ఆవశ్యకత కనబడింది. అందువల్ల ఈ పుస్తకం వ్రాయటానికి సంకల్పించాను.

ఆయన గురించి మూడు వందల పేజీలున్న ఇంగ్లీష్ పుస్తకాలు పది ఇచ్చారు. అవి చదవటానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఆ అద్భుతమైన వ్యక్తి జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఎంతో స్ఫూర్తి కలిగింది. ఒక సంకల్పంతో ఆయన చేపట్టిన పనులు చూస్తూ ఉంటే ఎంతో ఉత్తేజం, ఉద్వేగం కలిగాయి. ఆ తరువాత ఈ పుస్తకం రాయటానికి  ఉపక్రమించి, వ్రాస్తున్న ఆ ఆరు నెలలు ఒక అద్భుతమైన అనుభూతికి లోనయ్యాను. రాస్తుంటే ప్రతి వాక్యం తదాత్మ్యత. చేస్తున్న పనిలో ఆనందం పొందే అనుభూతిని సరస్వతి కూడా వర్ణించ లేదు.

ఇది నిజానికి ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం. శ్రీల ప్రభుపాద బొంబాయి ఇస్కాన్ మందిర స్థలం విషయంలో పడిన చిక్కులు, దాన్ని ఆయన డీల్ చేసిన విధానం, ‘ఉచిత ప్రసాదం పంపిణీ, మార్కెటింగ్ టెక్నిక్స్, సంకీర్తనల ద్వారా ప్రచారం, గుడి ఎంత విశాలంగా ఉండాలి, నిర్మాణం ఎంత అద్భుతంగా ఉండాలి, ఓటమి వచ్చినప్పుడు కెరటంలా ఎలా పైకి లేవాలి’ ప్రతి విషయమూ జీవితంలో గేలువాలనుకున్న ప్రతి వ్యక్తి చదవాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి, ఒక భక్తుడు విశ్వవిజేత ఎలా  అయ్యారో తెలుస్తుంది.

ఈ పుస్తకం నుంచి ఈ కాలం యువత ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆ మాటకొస్తే ఈ పుస్తకం ప్రభావం నా మీద ఎంతో పండింది. కొన్ని చిన్నచిన్న వ్యసనాలని  దూరం చేసుకోగలిగాను. అలాగే కోపము,  ద్వేషము, పగ మొదలైనవి ఏమైనా ఉంటే అవి సమూలంగా నాశనం అయ్యాయి. రోజుకి 18 గంటలు ఎలా పనిచెయ్యాలో తెలుసుకున్నాను.

ఈ సందర్భంగా ఈ అవకాశం నాకు కల్పించిన ఇస్కాన్ వారికి మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

యండమూరి వీరేంద్రనాథ్

Shopping Cart
Scroll to Top