About the Book
20వ శతాబ్దం మధ్యలో అమెరికా ప్రధాన నగరాల్లోని జనబాహుల్యానికి ప్రాచీన భారతదేశ వైదిక బోధనలను పరిచయం చేస్తూ పాశ్చాత్య సంస్కృతిని అత్యంత ప్రభావితం చేసిన “హరే కృష్ణ ఉద్యమం” లేదా ఇస్కాన్ (ISKCON) సంస్థాపకాచార్యుల స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ఈ ఉద్యమం సామాన్య ప్రజానీకం నుండి అలెన్ గిన్స్బర్గ్, జార్జ్ హారిసన్ వంటి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరినీ ఆకర్షించింది. సుమారు 100 కు పైగా దేశాల్లో అనుచరులను కలిగుంది. శ్రీల ప్రభుపాద అమెరికా మరియు భారతదేశాన్ని మారిస్తే, వారి జీవిత కథ మీ జీవితాన్ని మారుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రోత్సహిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
The inspirational story of the founder of ISKCON, also known as the “Hare Krishna Movement”, who emerged as a major figure of Western counterculture, introducing the ancient teachings of Vedic India to mainstream America in the mid 20th century, it attracted everyone from Allen Ginsberg to George Harrison and followers in more than 100 countries. Prabhupada changed America, and India, and his story will change your life, urging you towards self realisation.
Highlights of the Book
ఈ పుస్తకం కేవలం కృష్ణ సంకీర్తన గురించి మాత్రమే కాదు. మొక్కవోని ధైర్యంతో ఒక భక్తుడు “విశ్వవిజేత”గా ఎదిగిన పరిణామక్రమం. దానికి కావలసిన అంకిత భావం, నమ్మకం, దీక్ష, మరియు సంకల్పం. ప్రతి యువకుడు తెలుసుకోవలసిన, ఆచరించవలసిన వాస్తవ జీవిత గాధ.
“తనని పూజించే భక్తుడి కన్నా తన సూక్తులని ప్రజలకి దగ్గర చేసేవాడు నిజమైన భక్తుడు” అంటారు శ్రీ కృష్ణ పరమాత్ముడు. చేతిలో నయాపైసా లేకుండా ఓడ ఎక్కి, నెలల పాటూ సముద్రంలో ప్రయాణం చేసి, ముక్కు మొహం తెలియని విదేశీయుల మధ్య తన అస్థిత్వాన్ని నిలుపుకొని, దారీతెన్నూ తెలియని హిప్పీలను కృష్ణ చైతన్యం ద్వారా ఒక మార్గం లో పెట్టి, ప్రపంచమంతా సంకీర్తనం చేసి, కృష్ణ చైతన్యాన్ని వాడవాడలా విస్తరింపజేసిన ఈ మహనీయుడి కథ చదివి తరించండి.
శ్రీల ప్రభుపాద చెప్పిన ఈ మాట అక్షరాలా వర్తిస్తుంది. ఇస్కాన్ నిర్మాణానికి అయిన ఆ విధంగానే శ్రమించారు 70 ఏళ్ళు పైబడిన వయసులో అన్ని మందిరాలు కట్టటం, అన్ని పుస్తకాలు వ్రాయటం కేవలం కృష్ణుడి ఆశీర్వాదంతో భూమి మీదకు వచ్చిన వ్యక్తులకి మాత్రమే సాధ్యమ అవుతుంది.
ఆనకట్ట కట్టిన తర్వాత ఆ చల్లదనాన్ని, కమనీయమైన ప్రకృతిని, చెట్లని, వాటిపై పక్షుల కిలకిలారావాలు ఆనందించటం సులభం. కానీ ఆ ఆనకట్ట కట్టడానికి ఎవరో ఎంతో శ్రమతో, ఒక యజ్ఞంలా పని చేసి ఉంటారు.